News March 13, 2025
శ్రీసత్యసాయి: విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పల్లె వెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదన్నారు.
Similar News
News March 14, 2025
మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీ

మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా పోలీసు బృందం విజయం సాధించింది. పోలీసులకు, జర్నలిస్టులకు జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన పోలీసు బృందం మొదట బ్యాటింగ్ చేసి 69 రన్స్ చేసింది. 69 రన్స్‌కు గానూ జర్నలిస్టు బృందం 67 రన్లు తీసి రన్నర్‌గా నిలిచింది. రెండు రన్ల తేడాతో పోలీస్ టీం విజయం సాధించింది. కాగా మాన్ అఫ్ ది మ్యాచ్ విలేఖరి రాజశేఖర్‌కు దక్కింది.
News March 14, 2025
నిర్మల్: హంటర్‌కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు

జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలు అందించిన హంటర్ జాగిలం అనారోగ్యంతో మృతి చెందగా గురువారం రాత్రి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పలు హత్యలు దొంగతనాల కేసులను ఛేధించడంలో హంటర్ విశేష ప్రతిభను అందించిందని, పోలీసు శాఖకు అందించిన సేవలు వెలకట్టలేవని తెలిపారు.
News March 14, 2025
మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (2/2)

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట పేర్లతో మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో.. శ్రీరంగవరం, బండమాధరం, నూతనకల్, మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, సోమారం, రావల్‌కోల్, కండ్లకోయ, రాజ్‌బొల్లారం, ఘన్పూర్, గోసాయిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి. ఈ నెల 17న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.