News April 8, 2025

శ్రీసత్యసాయి: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

image

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం రాత్రి పెనుకొండ లోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంగా రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో నిబంధనల ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నాయకులు జన సమీకరణ చేయరాదన్నారు.

Similar News

News March 1, 2026

ADB: మోదుగు పూలతో.. చిన్నారుల హోలీ కేలీ

image

రంగుల పండుగ హోలీకి ఉమ్మడి ADBలోని చిన్నారులు సరికొత్తగా సిద్ధమవుతున్నారు. మార్కెట్లో లభించే రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రకృతి ప్రసాదించిన మోదుగు పూలతో రంగులను స్వయంగా తయారు చేస్తున్నారు. అడవిలో లభించే ఈ పూలను సేకరించి, వాటిని నీటిలో మరిగించి పర్యావరణహిత కాషాయం, పసుపు వర్ణపు రంగులను రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్న ఈ చిన్నారుల ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

News March 1, 2026

ఇవి ప్రభుత్వం ఇస్తున్న పక్కా ఇళ్లు!

image

ప్రకృతి విపత్తు వందలాది మందిని నిరాశ్రయులను చేస్తే కేరళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి బాధితుల జీవితాల్లో కొత్త ఆశలను నింపింది. వయనాడ్ బాధితుల కోసం ప్రభుత్వం నిర్మించిన అద్భుతమైన టౌన్‌షిప్ ఇవాళ ప్రారంభంకానుంది. ముండక్కై-చూరల్మల కొండచరియలు కూలడంతో ఇళ్లు కోల్పోయిన 178 కుటుంబాలకు మొదటి దశలో అన్ని సౌకర్యాలతో కూడిన 51 నూతన గృహాలను సీఎం పినరయి అందజేశారు. ఒక్కో ఇంటిపై రూ.26లక్షలు ఖర్చు చేశారు.

News March 1, 2026

ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి: భద్రాద్రి కలెక్టర్

image

సోమవారం(రేపు) కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించాలని అన్నారు.