News November 11, 2025

శ్రీసిటీలో రూ.1629 కోట్ల పెట్టుబడి.. 2,630 మందికి జాబ్స్

image

రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా నిన్న మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో శ్రీసిటీలో SCIC వెంచర్స్‌ LLP రూ.550 కోట్ల పెట్టుబడితో ACల్లో వినియోగించే PCBA, BLDC మోటార్ల తయారీ యూనిట్‌‌ను స్థాపించనుంది. క్రయో నెక్స్ట్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1,079 కోట్ల పెట్టుబడితో IT ఎన్‌క్లోజర్లు, PCB బేర్‌ బోర్డుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది.

Similar News

News November 11, 2025

వరంగల్‌లో 121 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు సోమవారం ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 121 కేసులు నమోదు కాగా, ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 74 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

News November 11, 2025

వరంగల్, కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్, కాజీపేట మీదుగా బెంగళూరు-ముజఫర్‌పూర్, యశ్వంతపూర్-ముజఫర్‌పూర్ మధ్య నాలుగు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లకు వరంగల్ సహా పలు స్టేషన్లలో స్టాప్‌లు కల్పించారు.

News November 11, 2025

జడేజాను వదులుకోవద్దు: సురేశ్ రైనా

image

జడేజాను CSK వదులుకోనుందనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా స్పందించారు. జడేజాను కచ్చితంగా రిటైన్ చేసుకోవాలన్నారు. CSKకు అతను గన్ ప్లేయర్ అని, టీమ్ కోసం కొన్నేళ్లుగా ఎంతో చేస్తున్నారని గుర్తు చేశారు. ‘సర్ జడేజా’ జట్టులో ఉండాల్సిందే అని జట్టు యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు సమాచారం. RRతో ట్రేడ్‌లో జడేజా స్థానంలో CSK సంజూను తీసుకోవడం ఖరారైనట్లు క్రీడావర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే.