News January 8, 2026
శ్రీ ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం

అప్పులు, ఆర్థిక ఒత్తిడి, రుణ భారంతో మనశ్శాంతి కోల్పోతున్నారా? ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? శ్రీ ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం ద్వారా రుణ బంధనాలు శమించి, ఆర్థిక అడ్డంకులు తొలగి, ధన ప్రవాహం మెరుగవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పుల నుంచి విముక్తి, ఆర్థిక స్థిరత్వం, శాంతి కోసం ఈ హోమం శ్రేయస్కరంగా భావించబడుతుంది. మీ పేరు & గోత్రంతో వేదమందిర్‌లో ఇప్పుడే <
Similar News
News February 10, 2026
AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్‌లోని AIIMS బీబీనగర్ 26 Jr. రెసిడెంట్, Sr. రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG, సంబంధిత విభాగంలో MD, DNB, DM, MS, MCh అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ రెసిడెంట్ పోస్టులను అకడమిక్ మెరిట్ ఆధారంగా, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in
News February 10, 2026
కృతజ్ఞత లేని వారికి మళ్లీ సాయం చేయొద్దు: పరుచూరి

ఇతరులు చేసిన మంచిని, సాయాన్ని ఇట్టే మర్చిపోయే రోజులివి. అలాంటి వారిని ఉద్దేశించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. మంచితనంతో చేసిన సాయాన్ని మర్చిపోయే వారికి మరోసారి మేలు చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. ఇది అర్హత లేని వారికి దానం చేయడం కిందకే వస్తుందని రాసుకొచ్చారు. కృతజ్ఞత లేని వారికి పొరపాటున కూడా మళ్లీ సాయం చేసి తప్పు చేయవద్దని ఆయన సూచించారు.
News February 10, 2026
HYD ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 50% HRA ఎగ్జెంప్షన్!

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం పాత పన్ను పద్ధతిలో ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు కేవలం ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే పరిమితమైన 50% HRA ఎగ్జెంప్షన్ ఇకపై హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్‌కూ వర్తించనుందని సమాచారం. అంటే కట్టే రెంట్‌లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.


