News April 10, 2025

శ్రీ కోదండ రామ స్వామి కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులు, శ్రీవారి సేవకులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. గ్యాలరీల్లో ఉండే భక్తులకు కళ్యాణ తలంబ్రాలు, స్వామి వారి ప్ర‌సాదం, అన్నప్రసాదాలను క్రమపద్ధతిలో అందించాలని సూచించారు.

Similar News

News July 8, 2025

కడప SP పరిష్కార వేదికకు 178 ఫిర్యాదులు

image

ఫిర్యాదుదారులకు చట్టపరమైన న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS)లో 178 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ పలు సమస్యలపై స్వయంగా విచారణ జరిపి, సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీస్ సిబ్బంది సహాయం అందించారు.

News July 7, 2025

అర్జీలు స్వీకరించిన కడప ఎంపీ

image

పులివెందులలోని తన నివాసంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు.

News July 7, 2025

పులివెందుల: స్తంభంపైనే చనిపోయాడు

image

పులివెందులలో విషాద ఘటన జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల సమీపంలో కరెంట్ పనులు చేయడానికి లైన్‌మెన్ శివారెడ్డి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభంపై పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ సరఫరా జరిగిందా? వేరే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.