News October 18, 2024

శ్రీ నాగ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి

image

ఆర్మూర్ పట్టణంలోని MLA క్యాంప్ కార్యాలయం ఆవరణలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందించామని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

Similar News

News December 31, 2025

NZB: మందుబాబులకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

image

మద్యం తాగి వాహనాలు నడపడాన్ని ఉపేక్షించేది లేదని ఫైన్, జైలు శిక్షకు గురికాక తప్పదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. న్యూయర్ వేడుకల్లో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మద్యం తాగి రోడ్ల మీద వాహనాలు నడిపిస్తే రూ.10 వేలకు మించిన ఫైన్‌తో పాటు జైలు శిక్ష పడుతుందన్నారు.

NZB: విక్రం నాయక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

image

తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T-20 క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా జట్టుకు చెందిన విక్రం నాయక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. HYDలోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో HYD జట్టును ఓడించడంలో విక్రమ్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లో 4 బౌండరీలు, 4 సిక్సర్లతో మొత్తం 61 పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేశాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.