News March 29, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి దర్శనం

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం శనివారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ్ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబంది, భక్తులు ఉన్నారు.
Similar News
News March 31, 2025
HCUలో హృదయవిదారకంగా నెమళ్ల ఆర్తనాదాలు: కిషన్ రెడ్డి

TG: రాష్ట్ర ప్రభుత్వం HCU భూములను వేలం వేయడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి కూడా బుల్డోజర్లతో చెట్లను కూల్చడం వల్ల అక్కడి నెమళ్ల ఆర్తనాదాలు హృదయవిదారకంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు, విద్యార్థుల గొంతు నొక్కుతూ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపి, HCU అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
News March 31, 2025
చైనాలో 1000 టన్నుల బంగారం నిక్షేపాలు

చైనా జాక్‌పాట్ కొట్టింది. దేశానికి ఈశాన్యంలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లో 1000 టన్నుల బంగారు నిక్షేపాలు బయటపడ్డాయని భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వీటిని మైనింగ్ చేయడం అసాధ్యమన్న అభిప్రాయాలు అంతర్జాతీయ నిపుణుల నుంచి వ్యక్తమవుతుండగా చైనా పరిశోధకులు కొట్టి పారేస్తున్నారు. సుమారు 3 కి.మీ మేర నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచంలో స్వర్ణ ఉత్పత్తిలో చైనాయే అగ్రస్థానంలో ఉంది.
News March 31, 2025
ఎంపురాన్@రూ.200 కోట్లు

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘L2:ఎంపురాన్’ మూవీ చరిత్ర సృష్టించింది. 5 రోజులు పూర్తికాక ముందే రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగుతోంది. ఈ నెల 27న మూవీ విడుదలైన విషయం తెలిసిందే.