News April 10, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
Similar News
News January 8, 2026
జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పాల్గొన్నారు.
News January 8, 2026
వరంగల్: పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ సభల్లో 31 మందితో కూడిన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడుగా పి.మహేశ్, ప్రధాన కార్యదర్శిగా పొడపంగి నాగరాజు, కోశాధికారిగా డి.ప్రణయ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు.
News January 8, 2026
KNR: శాతవాహన కామర్స్ కళాశాలలో అవార్డు ప్రదానం

శాతవాహన విశ్వవిద్యాలయ కామర్స్ కళాశాలలో చంద్రబాబు శంకరశెట్టి మెమోరియల్ అవార్డు ప్రదాన కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హరికాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన SU VC ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుల్లో రాణిస్తూ, మంచి విద్యని అభ్యసిస్తూ ఎన్నో బహుమతులు పొందాలని అన్నారు. ఈ అవార్డును అందజేసిన ఉస్మానియా ఆచార్యులు ప్రశాంత్ ఆత్మకి ధన్యవాదాలు తెలిపారు.


