News April 19, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం షష్టి తిధి శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
Similar News
News April 20, 2025
మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌పై సెహ్వాగ్ తీవ్ర విమర్శలు

స్టార్ ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వారిలో ఆడాలన్న ఆకలి, తమ జట్లకు ట్రోఫీలను గెలిపించాలన్న కసి ఏమాత్రం కనిపించడం లేదు. ఇద్దరూ భారత్‌లో హాలిడే చేసుకోవడానికి వచ్చారంతే. నేను చాలామంది ఓవర్సీస్ ఆటగాళ్లతో ఆడాను. వాళ్లలో అధికశాతం ఆటగాళ్లు ఇలాగే ఉంటారు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది IPLలో మ్యాక్సీ PBKSకి, లివింగ్‌స్టోన్ RCBకి ఆడుతున్నారు.
News April 20, 2025
IPL: టాస్ గెలిచిన ముంబై

వాంఖడేలో MIvsCSK మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో గత నెల 23న ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. దీంతో ఈరోజు పోరు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఐపీఎల్ ప్రియుల్లో నెలకొంది.
జట్లు:
CSK: రషీద్, రచిన్, మాత్రే, శంకర్, దూబే, జడ్డూ, ఓవర్టన్, ధోనీ, నూర్, ఖలీల్, పతిరణ
MI: రికిల్‌టన్, జాక్స్, సూర్య, తిలక్, పాండ్య, నమన్, శాంట్నర్, చాహర్, బౌల్ట్, బుమ్రా, అశ్వని
News April 20, 2025
కొమురవెల్లి మల్లికార్జునుడిని దర్శించుకున్న బక్కి వెంకటయ్య

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభీక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.