News February 18, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘమాస మంగళవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.
Similar News
News January 9, 2026
శాతవాహన LLB పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరుగనున్న LLB 1వ, 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా JAN 17 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో JAN 20 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
News January 9, 2026
21న రంగోత్సవ్ పోటీలు: శ్రీకాకుళం DEO

గార మండలం వమరవెల్లి డైట్ కళాశాలలో జనవరి 21న జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు నిర్వహిస్తామని శ్రీకాకుళం DEO రవిబాబు శుక్రవారం ఓ ప్రకటలో తెలిపారు. భారత స్వాతంత్ర్య సమరయోధులు చిత్రాలు గీయటం, కొటేషన్లతో కూడిన హ్యాండ్ రైటింగ్, పంజాబి జానపద నృత్య పోటీలు ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు.
News January 9, 2026
NZB: వ్యభిచార గృహాలపై CCS టీం మెరుపు దాడి

నిజామాబాద్ CCS ఇన్ఛార్జి ఏసీపీ మస్తాన్వలి ఆధ్వర్యంలో శుక్రవారం వ్యభిచార గృహాలపై మెరుపు దాడి నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వ్యభిచార గృహాలపై రైడ్ చేశారు. నలుగురు విటులు, ఐదుగురు మహిళలను పట్టుకున్నారు. రూ.27,290 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ SHOలకు అప్పగించారు.


