News October 12, 2025

శ్రీ రాంసాగర్‌ నీటిమట్టం 80.053 TMCలు

image

శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గడంతో ప్రస్తుతం 6,790 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 TMCలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 80.053 టీఎంసీలు(1090.90 అడుగులు)గా నమోదైంది. కాకతీయ కాలువ ద్వారా 5000, లక్ష్మి కాలువ ద్వారా 200, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. FFC అలీ సాగర్, గుప్తా ఎత్తిపోతలలకు నీటి విడుదలను నిలిపివేశారు.

Similar News

News October 12, 2025

జూబ్లీహిల్స్ అడ్డా.. ఎవరిది బిడ్డా..?

image

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అటు BRS, ఇటు కాంగ్రెస్ జోరు పెంచాయి. నువ్వానేనా అన్నట్లు రేసులో పరుగెత్తుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, ఏరియాలకు MLAలు, MLCలు, మాజీ MLAలను ఇన్‌ఛార్జులుగా BRS నియమించడంతో వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మంత్రులు, స్టేట్ లీడర్లు రంగంలోకి దిగి డివిజన్ల వారీగా పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్ థగ్ ఆఫ్ వార్‌లో గెలిచేదెవరో?

HYD: మహిళలూ మీకోసమే.. వేదిస్తే ఇలా చేయండి!

image

యువతులు, మహిళలు ఇబ్బందులు పడితే ఇలా ఫిర్యాదు చేయండి. గృహహింస, వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు, లింగ వివక్షత, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, అత్యాచారం, సైబర్ నేరాలు, అక్రమన రవాణా, బలవంత వ్యభిచారం వంటి వాటిపై ఫిర్యాదు చేయొచ్చు. మీకు అండగా ఉంటామని HYD ప్రోగ్రాంలో మహిళా కమిషన్ తెలిపింది. హెల్ప్ లైన్ 040 27542017, telanganastatewomencommission@gmail.com సంప్రదించండి.