News March 20, 2024

శ్రీ సత్యసాయి: ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. పుట్టపర్తి రూరల్ మండలంలోని కంబాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రామాంజనేయులు, కదిరి పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని, వారిని సస్పెండ్ చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు.

Similar News

News September 3, 2025

పుట్లూరులో రైతు ఆర్థిక సంక్షోభానికి సీఎం చలించి సహాయం

image

పుట్లూరుకు చెందిన తలారి శ్రీనివాసులు చిన్న రైతు. కుక్కల దాడిలో తన గొర్రెలన్నింటినీ కోల్పోయి తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యారు. ముగ్గురు ఆడపిల్లలు. అందులో ఒకరు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. కుటుంబం తీవ్ర సంక్షోభంలో పడింది. పరిస్థితిని MP అంబికా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం తక్షణమే స్పందించి రూ.2.4 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేశారు. ఈ చర్య రైతుకు మానసికంగా మద్దతునిచ్చింది.

News September 3, 2025

జిల్లాలో బీడు భూములు ఉండకూడదు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో బీడు భూములు ఉండకూడదని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు. బీడు భూమిలో ఉద్యాన పంటలు, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ ఉండాలని చెప్పారు. ఏడు నియోజకవర్గాలలోని ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్తగా ఎంపిక చేసిన గ్రామాలకు వార్షిక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

News September 2, 2025

స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖలు పనిచేయాలి: కలెక్టర్

image

స్వయం సహాయక సభ్యులు, రైతు సంఘాల సభ్యులకు సుస్థిరమైన జీవనోపాధి, స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖల అధికారులు పని చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలన్నారు. లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు.