News December 21, 2025
శ్రీ సత్యసాయి: ఒకే నేతకు నాలుగు పదవులు

TDPలో మడకశిర MLA MS రాజుకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయనకు 4 కీలక పదవులు దక్కాయి. ఇప్పటికే మడకశిర MLAగా, TTD బోర్డు సభ్యుడిగా, TDP రాష్ట్ర SC సెల్ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను తాజాగా సత్యసాయి జిల్లా TDP అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. యువగళం పాదయాత్ర నుంచి పార్టీ బలోపేతానికి చేసిన సేవలకే ఈ గుర్తింపు లభించిందని మద్దతుదారులు చెబుతున్నారు.
Similar News
News December 26, 2025
ఈనెల 31 నుంచి యాసంగి పంటకు సాగునీటి విడుదల

LMD నుంచి కాకతీయ కాలువల ద్వారా ఈనెల 31న ఉ.11 గంటలకు రైతులకు యాసంగి పంటకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ రమేశ్ తెలిపారు. నీటి పారుదల శాఖ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో జోన్ 1కు 7 రోజులు, జోన్ 2కు 8 రోజులు సాగునీటి విడుదల చేయనున్నట్లు తెలిపారు. సాగునీటిని వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులను కోరారు.
News December 26, 2025
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి: కిషన్ రెడ్డి

TG: డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పదేళ్లలో 2 ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల కోట్లు అప్పు చేశాయని ఆదిలాబాద్‌లో జరిగిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో ఆరోపించారు. దోచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి KCR కుటుంబం రోడ్డెక్కిందన్నారు. రేవంత్ పాలనలో రాష్ట్రం మరింత ఆగమైందని విమర్శించారు.
News December 26, 2025
ఇందిరమ్మ ఇళ్లలో జనగామ ముందంజ!

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో జనగామ జిల్లా ముందంజలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెండు విడతల్లో 5,834 ఇళ్లు మంజూరు కాగా, 5,206 ఇళ్లు నిర్మాణ దశలో, 33 ఇళ్లు పూర్తి అయ్యాయని చెప్పారు. వివిధ శాఖల అధికారుల భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.


