News September 12, 2024

శ్రీ సత్యసాయి: కత్తి, తుపాకీతో నృత్యాలు.. ఏడుగురిపై కేసు నమోదు

image

మడకశిర మండలం గుండుమలలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఏడుగురు యువకులు కత్తి, నాటు తుపాకీ చేత పట్టుకుని నృత్యాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో ఏడుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ రాజు కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి తల్వార్ (కత్తి), నాటు తుపాకీ (రివాల్వర్)ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Similar News

News December 30, 2025

పరిశ్రమల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ఆయా శాఖల అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్ఠం చేసేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలన్నారు. వారికి సకాలంలో సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులు అందజేయాలన్నారు.

News December 29, 2025

అనంతపురం పోలీస్ కార్యాలయంలో వినతుల వెల్లువ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 70 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఎస్పీ స్వయంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. చట్ట పరిధిలో ప్రతి పిటిషన్‌ను విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

News December 29, 2025

కలెక్టరేట్‌లో వినతుల వెల్లువ

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొనగా, మొత్తం 467 అర్జీలు నమోదయ్యాయి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.