News December 26, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్: ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణలో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జనవరి నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. డే విజన్, నైట్ విజన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. బహిరంగ మద్యపానం, గంజాయి విక్రయాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ డ్రోన్ల వినియోగం ఎంతో కీలకంగా మారుతుందని ఆయన వివరించారు.
Similar News
News December 28, 2025
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 3 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంఏ(హిందీ) పీహెచ్‌డీ, NET/JRF అర్హత గల అభ్యర్థులు జనవరి 5వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in/
News December 28, 2025
కొత్తగూడెం: ఈ ఏడాది చోరీ కేసుల వివరాలు ఇలా..!

జిల్లాలో ఈ ఏడాది 307 చోరీ కేసుల్లో రూ.3,75,10,691 సొత్తును కోల్పోగా 141కేసుల్లో రూ.1,21,99,297 సొత్తును రికవరీ చేశామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. లోక్ అదాలత్లో ఈ ఏడాది మొత్తం వివిద రకాల 20,595 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 15,347 కేసులు, సైబర్ క్రైమ్ సంబంధించి 196 కేసులు నమోదయ్యాయని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
News December 28, 2025
జెప్టో.. రూ.11 వేల కోట్లకు IPO

క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి డాక్యుమెంట్లు సమర్పించింది. ఈ IPO ద్వారా సుమారు రూ.11వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026లో మార్కెట్లో లిస్టింగ్ కావాలని భావిస్తోంది. కాగా 2020లో అదిత్, కైవల్య ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దీని విలువ 7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే దీని పోటీదారులైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ (జొమాటో) లిస్ట్ అయ్యాయి.


