News May 4, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం జౌకల గ్రామంలో ఓ వ్యక్తిని దారుణ హత్య చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నాగభూషణం(38) అనే వ్యక్తిని దుండగులు అతి దారుణంగా దాడిచేసి హత్య చేశారు. శనివారం ఉదయం గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కదిరి పోలీసులు తెలిపారు.

Similar News

News February 6, 2026

అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు అందని ఐరన్ సిరప్

image

అనంతపురం జిల్లాలో ఉన్న 2,302 అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు ఐరన్ సిరప్ వేయడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై జిల్లాస్థాయి అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని పలువురు అంగన్వాడీ టీచర్లు తెలిపారు. వారానికి 2 సార్లు వేయాలని, ఐరన్ సిరప్‌ల స్టాక్ లేదని ANM, ఆశా వర్కర్లు చెబుతున్నారు. ఈ విషయంపై DMHO దేవిని సంప్రదించగా.. పిల్లలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.

News February 6, 2026

అవార్డు అందుకున్న తాడిపత్రి బుడ్డోడు

image

తాడిపత్రికి చెందిన 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బుడతడు సీహెచ్ 126.. సర్ సివీ రామన్ యంగ్ జీనియస్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇటీవల ఒలింపియాడ్ పరీక్షలలో సత్తాచాటి 3వ స్థానంలో నిలిచాడు. హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా 33వ సర్ సివీ రామన్ యంగ్ జీనియస్ అవార్డు అందుకున్నారు.

News February 5, 2026

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ పూర్తి చేయాలి: అనంత వెంకటరామిరెడ్డి

image

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకుంటే, చంద్రబాబు సీఎం అయ్యాక పనులు నిలిపివేయడం అన్యాయమన్నారు. సీమ ప్రయోజనాల కోసం హంద్రీనీవా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.