News March 10, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 140 మంది గైర్హాజరు.!

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-2 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి సోమవారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 6339 మందికి గానూ.. 6236మంది, ఒకేషనల్ విద్యార్థులు 1144 మందికి గానూ 1107 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 140 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.

Similar News

News February 23, 2026

అధికారులు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కాలంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

News February 23, 2026

బోద నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి: VZM కలెక్టర్

image

జిల్లాలో బోద (ఫైలేరియా) నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. గుర్ల మండలంలో ఇప్పటివరకు 5,516 మందికి డీఈసీ మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 7,710 మందికి మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

News February 23, 2026

రామసముద్రం: జ్వరంతో ఇంటర్ విద్యార్థిని మృతి

image

రామసముద్రం మండలం గంపనంపల్లికి చెందిన పవిత్ర (17) తిరుపతిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 20న జ్వరం రావడంతో పద్మావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. పరిస్థితి విషమించడంతో రుయా ఆసుపత్రికి తరలించగా.. ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.