News March 24, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 145 మంది గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 145 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. ఇవాళ మ్యాథ్స్ పరీక్ష జరగ్గా రెగ్యులర్ విద్యార్థులు 21,394 మందికి గానూ 21,283 మంది హాజరయ్యారని, ప్రైవేటు విద్యార్థులు 235 మందికి గానూ 201 హాజరయ్యారన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి.

Similar News

News November 8, 2025

నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

image

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.

News November 8, 2025

సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా వేణుగోపాల్

image

సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన హుజూర్‌నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న జయ మనోహరి పదోన్నతిపై వెళ్లడంతో, ఆ స్థానంలో డా.వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం పట్ల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

News November 8, 2025

శ్రీవారి సుప్రభాత సేవ ఎలా జరుగుతుందంటే..?

image

తిరుమల శ్రీవారి ఆలయంలో తొలి సేవ ‘సుప్రభాతం’. ఇది ఉ.3 గంటలకు జరుగుతుంది. స్వామివారిని మేల్కొలిపే దివ్య ఘట్టమిది. పవిత్ర మంత్రాలు, శ్లోకాలు, మధుర నాదాలతో అర్చకులు స్వామివారిని నిదురలేపి, నిత్య కైంకర్యాలకు ఆహ్వానిస్తారు. ఈ సేవతోనే రోజు ప్రారంభమవుతుంది. ఈ సేవకు ఎంపికైన భక్తులకు స్వామివారిని <<17956589>>అతి దగ్గరి నుంచి<<>>(10Ft) దర్శించుకునే మహాభాగ్యం లభిస్తుంది. ☞ మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.