News March 7, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 244 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నేడు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-2 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథరెడ్డి శుక్రవారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 9,410 మందికి గానూ 9,202 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,151 మందికి గానూ 1,114 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 244 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
Similar News
News November 8, 2025
మహిళలు వేధింపులపై మౌనంగా ఉండొద్దు: ఎస్పీ నరసింహ

మహిళలు, బాలికలు లైంగిక వేధింపులను ధైర్యంగా బయటకువచ్చి చెప్పాలని ఎస్పీ నరసింహ సూచించారు. పనిచేసే చోట, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో మహిళలు, బాలికలు ఆపద సమయాల్లో హెల్‌లైన్ నంబర్లు సంప్రదించాలని ఎస్పీ అన్నారు. ‘వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్ పనిచేస్తాయని’ ఎస్పీ మహిళలకు సూచించారు.
News November 8, 2025
జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్‌పై అవగాహనా కార్యక్రమాలు

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాలతో జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో శక్తి యాప్‌పై పోలీసులు శనివారం అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు, విద్యార్థులు శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలన్నారు. ఆపద సమయంలో డయల్ 100, 112, 1091, 1098, 181, 1930కు ఫోన్ చేస్తే 5 నిమిషాలలో పోలీసులు మీ ముందు ఉంటారన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.
News November 8, 2025
మోతె: భార్యని హత్య చేసిన భర్త అరెస్ట్

మద్యం మత్తులో తాగడానికి డబ్బులు కోసం కర్రతో కిరాతకంగా భార్యని చంపిన భర్తను మోతె పోలీసులు అరెస్ట్ చేశారు. మోతె పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణారెడ్డి వివరాలు తెలిపారు. విభాలాపురం గ్రామానికి చెందిన బందేల్లి భార్య కరీంబీని తాగేందుకు డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో కర్రతో దాడి చేయగా చనిపోయింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


