News March 26, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 252 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి ఫిజిక్స్ పరీక్షకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 227 మంది, ప్రైవేట్ విద్యార్థులు 25 మంది గైర్హాజరు అయ్యారన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో పరీక్షలు జరిగినట్లు చెప్పారు.
Similar News
News March 29, 2025
పార్వతీపురం: శాశ్వత లోక్ అదాలత్‌పై అవగాహనా సదస్సు

ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించి శాశ్వత లోక్ అదాలత్ ఆవశ్యకత, సామర్ధ్యం పెంపుదల, కేసుల పరిష్కార విధానం, సామర్ధ్య పెంపుదల మార్గాలు, వివాదాలను పరిష్కరించే అధికారం శాశ్వత లోక్ అదాలత్‌కు ఉందని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పారా లీగల్ వాలంటీర్ల శిక్షణా సమావేశంలో పాల్గొన్నారు. శాశ్వత లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
News March 29, 2025
కన్నప్ప విడుదల వాయిదా: మంచు విష్ణు

కన్నప్ప సినిమా విడుదల ఆలస్యం అవుతుందని నటుడు, నిర్మాత మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. VFX వర్క్ కోసం మరిన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. అందుకే విడుదల తేదీ ఆలస్యం కానుంది. దీనికి మేం చింతిస్తున్నాం. మీ ఓపికకు, మద్దతుకు ధన్యవాదాలు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
News March 29, 2025
సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 31న రంజాన్ పండుగ సందర్భంగా పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు శనివారం కలెక్టర్ షాన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలు, అధికారులందరూ గమనించాలని ఆయన కోరారు.