News March 28, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 265 మంది విగైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షకు 265 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 21,658 మందికి గానూ 21,429 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 429 మందికి గానూ 393 మంది హాజరయ్యారని చెప్పారు.

Similar News

News March 31, 2025

కొడాలి నాని హెల్త్ అప్‌డేట్

image

వైసీపీ నేత కొడాలి నాని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం ఛాతినొప్పితో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు. స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీ కోసం కొంత సమయం తీసుకోవాలని కుటుంబసభ్యులు యోచిస్తున్నారు. నానిని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించే అవకాశం ఉంది.

News March 31, 2025

NGKL: వివాహితపై అత్యాచారం.. ఆ వ్యక్తిదే కీలకపాత్ర!

image

ఊర్కొండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయానికి దర్శనార్థం వచ్చిన<<15944914>> ఓ వివాహితపై జరిగిన అత్యాచార ఘటన<<>> సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి దేవాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మొత్తం ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుండగా.. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 31, 2025

సంచలనం.. ‘మ్యాడ్ స్క్వేర్’ భారీ కలెక్షన్లు

image

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.55.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. మ్యాడ్ గ్యాంగ్ చేసే కామెడీకి ప్రేక్షకుల గోలతో థియేటర్లు షేక్ అవుతున్నాయని పేర్కొంది. కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు కీలక పాత్రలు పోషించారు.

error: Content is protected !!