News March 4, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 413 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లాలో 12,162 మంది విద్యార్థులకు గానూ 11,749 విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 1,696 మంది విద్యార్థులకు గానూ 1,595 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>
News April 16, 2026
VKB జిల్లా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి!

జిల్లాలో భూగర్భ జల మట్టం రోజురోజుకూ ఆందోళనకరంగా పడిపోతోంది. జిల్లాలో సగటున 13.9 మీటర్ల లోతుకు నీటి నిల్వలు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షపాతం తగ్గడం మరియు విచ్చలవిడిగా బోర్లు వేయడమే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News April 16, 2026
MDK: డిప్లొమా కోర్సుల్లో అనాథ బాలికలకు 70% సీట్లు: కలెక్టర్

HYDలోని ప్రభుత్వ మహిళా సాంకేతిక విద్యా సంస్థలో అనాథ, నిరుపేద బాలికలకు డిప్లొమా కోర్సుల్లో 70 శాతం సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సివిల్, CSE, ECE, EEE విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పాలిసెట్ (POLYCET) ద్వారా ప్రవేశం పొందవచ్చని, ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.


