News March 1, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 479 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులలో 11,843 మంది విద్యార్థులకు గానూ 11,460 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,580 మంది విద్యార్థులకు గానూ 1,484 మంది హాజరయ్యారన్నారు. 479 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు.
Similar News
News March 1, 2025
కడప రిమ్స్‌కు పోసాని

AP: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన నటుడు పోసాని కృష్ణమురళికి జైలులో అస్వస్థతకు గురవ్వగా రాజంపేటలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా ఈసీజీ పరీక్షలో వైద్యులు స్వల్ప తేడాలు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
News March 1, 2025
కిర్లంపూడి: ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

కిర్లంపూడి మండలం సోమవరం జంక్షన్ వద్ద NH-16పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ నూకరాజు(47) మృతి చెందాడు. కిర్లంపూడి పోలీసుల వివరాల ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నూకరాజు ఖాళీ వాటర్ కేన్‌లతో ఆటోపై ఇంటికి వస్తుండగా వైజాగ్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిర్లంపూడి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2025
పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

AP: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. GD నెల్లూరులో మాట్లాడుతూ.. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. ‘త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల చొప్పున అందజేస్తాం. జూన్ నాటికి DSC ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని పునరుద్ఘాటించారు.