News January 8, 2026
శ్రీ సత్యసాయి జిల్లాలో 68 ఉద్యోగాలకు నోటిఫికేషన్

శ్రీ సత్యసాయి జిల్లాలోని KGBVల్లో 68 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 21, టైప్-4 కేజీబీవీల్లో 47 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.
Similar News
News February 10, 2026
ఉపవాసం: ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?

ఉపవాసం శ్రేష్ఠమైనదే అయినా అందరికీ వర్తించదు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మధుమేహం, రక్తహీనత, గుండె జబ్బులు ఉన్నవారు సుదీర్ఘ సమయం ఆహారం మానేస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. స్థూలకాయులు, BP, చర్మ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహాతో ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
News February 10, 2026
స్పీకర్‌పై అవిశ్వాసం.. మెజార్టీ ఉంటేనే!

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్షాలు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 94-C కింద తీర్మానం ప్రవేశ పెట్టాలి అంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. సభలోని 50 మంది సభ్యులు మద్దతుతో నోటీసు ఇచ్చాక చర్చకు నిర్దేశిస్తారు. 10 రోజుల్లోపే చర్చ చేపట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. మెజార్టీ ఆధారంగా అనర్హత వేటు ఉంటుంది. కాగా లోక్‌సభలో NDAకే మెజార్టీ ఉండటంతో స్పీకర్ తొలగింపు అసాధ్యమే.
News February 10, 2026
NTR: అరుణాచలం వెళ్లేవారికి ఊరట కలిగించే వార్త

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా కాకినాడ టౌన్(CCT)-అరుణాచలం(తిరువణ్ణామలై- TNM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07617 CCT-TNM రైలు FEB 14న, నం.07618 TNM-CCT రైలు FEB 16న నడుస్తాయన్నారు. ఈ రైళ్లు మార్గమధ్యంలో సామర్లకోట, రాజమండ్రి, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు తదితర స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.


