News December 18, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్‌గా గ్రంధం చంద్రుడు

image

అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్‌లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు CS విజయానంద్ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా సత్యసాయి జిల్లా ఇంఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడును నియమించింది. గతంలో గంధం చంద్రుడు ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

Similar News

News December 19, 2025

శ్రీవారిని దగ్గర నుంచి చూడాలంటే?

image

సాధారణ భక్తులు 70 అడుగుల దూరం నుంచి స్వామిని చూస్తే, లక్కీడిప్‌లో ఎంపికైన వారు 9 అడుగుల దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఆన్‌లైన్ లక్కీడిప్‌లో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎంపికయ్యే అవకాశాలు తక్కువ. అందుకే మీరు తిరుమల వెళ్లినప్పుడు అక్కడ నేరుగా ‘ఆఫ్‌లైన్ లక్కీడిప్’లో నమోదు చేసుకుంటే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు డొనేట్ చేయడం వల్ల కూడా మొదటి గడప దర్శన భాగ్యం లభిస్తుంది.

News December 19, 2025

ఇంగ్లిస్ విషయంలో PBKS ఆగ్రహం!

image

IPLలో 4 మ్యాచులే ఆడతారని తెలియడంతో PBKS ఇంగ్లిస్‌ను రిలీజ్ చేయగా, మినీ వేలంలో LSG రూ.8.6CRకు దక్కించుకుంది. కాగా ఇంగ్లిస్ APR 18న పెళ్లి చేసుకొని వెంటనే IND వస్తారని, హనీమూన్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. దీంతో PBKS బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమకీ విషయం తెలిస్తే వదిలేవాళ్లం కాదంటోంది. అయితే ఇంగ్లిస్-BCCI మధ్య మిస్ కమ్యూనికేషన్ జరిగిందా? ప్లేయర్ ప్లాన్స్ మార్చుకున్నారా అనేది తెలియాలి.

News December 19, 2025

ఈ పొరపాటు చేస్తే పశువులకు అబార్షన్ అవుతుంది

image

కొన్ని పశువులు గర్భంతో ఉన్నప్పటికీ తీగలు వేస్తుంటాయి. దీనికి కారణం పశువులు గర్భంతో ఉన్నప్పుడు 4 లేదా 5వ నెలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల తీగలు వేస్తాయి. దీన్నే జస్టేషనల్ హీట్ అంటారు. అందుకే ఎద ఇంజెక్షన్ వేసిన మూడు నెలల తర్వాత పశువులకు చూడి నిర్ధారణ పరీక్ష తప్పకుండా నిర్వహించాలి. ఇది చేయకుండా తీగలు వేసిందని మళ్లీ ఎద ఇంజెక్షన్ వేయిస్తే అబార్షన్ అవుతుందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.