News March 17, 2025

శ్రీ సత్యసాయి జిల్లా: ఐసీడీఎస్ పీడీగా శ్రీదేవి బాధ్యతలు స్వీకరణ

image

శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా శ్రీదేవి బాధ్యత స్వీకరించారు. తాడిపత్రిలో పనిచేస్తున్న శ్రీదేవి పదోన్నతిపై శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సోమవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆమె కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.

Similar News

News March 17, 2025

TG న్యూస్ రౌండప్

image

☛ అనారోగ్యానికి గురై HYD ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట MLA వంశీకృష్ణను పరామర్శించిన CM రేవంత్
☛ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కేటీఆర్ సరదా సంభాషణ.. ఆరోగ్యం ఎలా ఉందని అడిగిన KTR
☛ రేపు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు
☛ SLBC సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. మరోసారి టన్నెల్‌లోకి క్యాడవర్ డాగ్స్
☛ ఓబులాపురం మైనింగ్ కేసు.. బీవీ శ్రీనివాస్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

News March 17, 2025

‘సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట వంట వార్పు’

image

తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు, వెల్ఫేర్లు 48గంటల పాటు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ జిల్లా కన్వీనర్ బొలిశెట్టి భాస్కరమ్మ, సీటు జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, అంగన్వాడీ టీచర్లు, వెల్ఫేర్లు పాల్గొన్నారు.

News March 17, 2025

యాదగిరిగుట్ట: ప్రసాద విక్రయాలతో రూ.7,92,130 ఆదాయం 

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. సోమవారం 1,640 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.82,000, ప్రసాద విక్రయాలు రూ.7,92,130, VIP దర్శనాలు రూ.1,95,000, బ్రేక్ దర్శనాలు రూ.66,900, కార్ పార్కింగ్ రూ.2,70,000, వ్రతాలు రూ.94,400, ప్రధాన బుకింగ్ రూ.1,16,550, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.19,29,241 ఆదాయం వచ్చింది.

error: Content is protected !!