News October 12, 2024
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే 88852 89039కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News February 13, 2026
అనంతపురం జిల్లాలో పదోన్నతులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీపీవో, డీఎల్పీవో కార్యాలయాల యూనిట్ నుంచి ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 నుంచి గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా ఐదుగురికి కలెక్టర్ ఆనంద్ పదోన్నతి కల్పించినట్లు DPO నాగరాజు నాయుడు తెలిపారు. పదోన్నతి పొందిన ఐదుగురు ఉద్యోగులకు త్వరలోనే పంచాయతీలు కేటాయిస్తామన్నారు.
News February 12, 2026
110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాల పంపిణీ

110 మంది గ్రామ రెవెన్యూ (గ్రేడ్-II) అధికారులు గ్రేడ్-Iగా పదోన్నతి పొందినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో 110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. పదోన్నతులు పొందిన ఉద్యోగస్తులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలన్నారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించి లక్ష్యసాధనలో సత్ఫలితాలు సాధించాలన్నారు.
News February 12, 2026
మాజీ సీఎంసంజీవయ్య జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 14న ఏపీ తొలి దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14న ఉదయం 10:30 గంటలకు రెవెన్యూ భవన్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులు, దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం కలెక్టర్ పిలుపునిచ్చారు.


