News March 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: ‘కౌలు చట్టాన్ని తీసుకురావాలి’

వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో కౌలు రైతుల రక్షణ, సంక్షేమం కోసం కౌలు చట్టాన్ని తీసుకురావాలని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు అడపాల వేమ నారాయణ పేర్కొన్నారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో సంఘం ప్రతినిధులతో కలిసి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కౌలు చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 17, 2025
కథలాపూర్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో కాసారపు రాజగంగు (50) అనే మహిళ ఉరేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. భర్తతో పాటు కుమారుడు ఏమి పని చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు తలెత్తాయన్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని, ఆవేదనతో సోమవారం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News March 17, 2025
ఈ సమయంలో పండ్లు తింటున్నారా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినడం ఎంతో అవసరం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాటిని ఆస్వాదించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పరగడుపుతో అస్సలు తినకూడదు. అలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే కడుపు నిండా భోజనం చేసిన తర్వాత వీటిని తింటే శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి. పడుకునే ముందు తీసుకోకూడదు. అజీర్తి సమస్యలు వస్తాయి. డెయిరీ పదార్థాలతో కలిపి వీటిని తినకూడదు.
News March 17, 2025
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ బిల్లు రూపొందించగా తాజాగా ఆమోదం లభించింది. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.