News April 1, 2025
శ్రీ సత్యసాయి జిల్లా ఫ్యాఫ్టో నూతన కార్యవర్గం ఎన్నిక

ఏపీ ఉపాధ్యాయుల సంఘాల సమైక్య ఫ్యాఫ్టో ఛైర్మన్ కోడూరు శ్రీనివాసులు అధ్యక్షతన సోమవారం అంతర్జాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. జిల్లా ఫ్యాఫ్టో ఛైర్మన్ ఎన్‌పి కుంటకు చెందిన గజ్జల హరిప్రసాద్ రెడ్డి, సెక్రటరీగా గౌస్ లాజం, కోశాధికారి భాస్కర్ రెడ్డితో పాటు మరో ఆరుగురిని ఎన్నికున్నారు. సభ్యులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News November 8, 2025
శ్రీవారి రక్తం నుంచి ఉద్భవించింది ఎర్ర చందనం: DCM పవన్

ఎర్ర చందనం చాలా అపురమమైనదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గాయం తగిలి, గాయం వల్ల చిందిన రక్తంతో ఎర్రచందనం పుట్టినట్లు శాస్త్రం చెబుతోందన్నారు. ఏపీలోని స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిలిపివేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 8, 2025
కీరాతో ఎన్నో లాభాలు

కీరా దోసకాయ అంటే తెలియని వారెవరూ ఉండరు. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నోలాభాలుంటాయంటున్నారు నిపుణులు. *కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. *C, K విటమిన్లు, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది. * దీన్ని తినడం వల్ల గుండెఆరోగ్యంగా ఉంటుంది.
News November 8, 2025
పిట్లం: బువ్వ విలువ తెలిసిన అవ్వ..!

వరి కోతలు చివరి దశకు చేరుకోవడంతో, రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్లపై రాశులుగా ఆరబెట్టారు. ఈ ధాన్యం ఎండిన తరువాత రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో, బువ్వ విలువ తెలిసిన కొందరు వృద్ధ మహిళలు రోడ్లపై పడివున్న ధాన్యపు గింజలను వృథా చేయకుండా సేకరించారు. రాళ్లు లేకుండా శుభ్రం చేసి జాగ్రత్తగా సంచుల్లో నింపుకున్నారు. పిట్లం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం కనిపించిన దృశ్యమిది.


