News February 6, 2025
శ్రీ సత్యసాయి జిల్లా మంత్రులకు సీఎం ర్యాంకులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738841822149_727-normal-WIFI.webp)
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరుపై సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో శ్రీ సత్యసాయి జిల్లా మంత్రులు సత్యకుమార్ యాదవ్ 7, సవిత 11వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.
Similar News
News February 6, 2025
రేపు వైసీపీలోకి శైలజానాథ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738851889407_367-normal-WIFI.webp)
AP: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరనున్నారు. ఇటీవల ఆయన జగన్‌తో భేటీ కాగా చేరికకు వైసీపీ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఉ.10 గంటలకు తాడేపల్లిలో శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.
News February 6, 2025
బోయినిపల్లి: దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న సుడిగాలి సుధీర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738851408813_50010065-normal-WIFI.webp)
బోయినపల్లి మండలంలోని వరద వెళ్లి గ్రామంలో గుట్టపై వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈరోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుకున్నారు. గుట్ట పైన ఎంతో ప్రకృతి అందాలతో బోటు ద్వారా వచ్చి దత్తాత్రేయుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నాగుల సాంబయ్య, భక్తులు ఉన్నారు.
News February 6, 2025
గోకవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738851295014_1221-normal-WIFI.webp)
కొత్తపల్లి నుంచి కామరాజుపేట వెళ్లే జంక్షన్ వద్ద గురువారం బైక్ అదుపుతప్పి రోడ్డుపై యువకుడు పడిపోయాడు. దీంతో అతడి తలకు బలంగా దెబ్బ తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108కు కాల్ చేసి గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.