News February 8, 2025

శ్రీ సత్యసాయి జిల్లా మహిళలకు గుడ్‌న్యూస్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని మహిళలకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఈ నెల 28వ తేదీ నుంచి మహిళలకు కుట్టు మెషీన్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా మహిళలకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Similar News

News February 8, 2025

17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్‌కు 10న ఒక్క రోజే గడువు ఉంది.

News February 8, 2025

రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా కథ ఇదేనా?

image

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారని తొలుత ప్రచారం నడిచింది. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా కథ గురించి హింట్ ఇచ్చారు. ‘రాత్రుళ్లు షూటింగ్, ఫ్లడ్ లైట్లు, పవర్ క్రికెట్, విచిత్రమైన కోణాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ ఆధారంగా మూవీ కథ ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

News February 8, 2025

సంగారెడ్డి: 10th ఎఫ్ఏ మార్కుల రికార్డుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు 

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఎఫ్ఏ మార్కుల రికార్డుల పరిశీలనకు పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీ వరకు అన్ని పాఠశాలలను సందర్శించి రికార్డుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సుమారుగా 70 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

error: Content is protected !!