News March 13, 2025
‘శ్రీ సత్యసాయి జిల్లా మొదటి స్థానంలో ఉండాలి’

శ్రీ సత్యసాయి జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని వృద్ధిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ తెలిపారు. అన్ని బస్ స్టేషన్లలో తాగునీరు ఏర్పాటుచేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరారు. రహదారి ప్రమాదాలు జరగకుండా సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు. దూర ప్రాంత సర్వీసులలో వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
Similar News
News April 8, 2026
ఇంటర్ రిజల్ట్స్ వార్తలు ఫేక్.. నమ్మొద్దన్న బోర్డు!

AP: ఇంటర్ ఫలితాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది. ఏప్రిల్ 12న రిజల్ట్స్ విడుదలవుతాయనే వార్తలు పూర్తిగా అబద్ధమని బోర్డు కమిషనర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు. ఫలితాల తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, విద్యార్థులు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. రిజల్ట్స్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేస్తామని చెప్పారు.
News April 8, 2026
వైభవ్‌ను ఇక వెయిట్ చేయించొద్దు: ఇర్ఫాన్

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. బుమ్రా వంటి దిగ్గజ బౌలర్‌ను ఫోర్లు, సిక్సర్లతో టెన్షన్ పెట్టడం ఈజీ కాదని కొనియాడారు. ‘వైభవ్‌ను ఇక వెయిట్ చేయించకుండా వెంటనే టీమ్ ఇండియాలోకి తీసుకోండి’ అని BCCI సెలక్టర్లను కోరారు. బుమ్రానే ఆలోచనలో పడేసిన ఈ కుర్రాడు మరో 20 ఏళ్ల పాటు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగలడని, ఇది బౌలర్లకు హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.
News April 8, 2026
‘రాకా’లో హీరో, విలన్‌గా అల్లు అర్జున్?

అట్లీ తీస్తున్న ‘రాకా’ సినిమాలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లుక్ విస్మయానికి గురిచేస్తోంది. మీడియా కూడా ఈ మూవీ టైటిల్, బన్ని పాత్రను పసిగట్టలేనంతలా మేకర్స్ గోప్యతను పాటించారు. అయితే ఈ యానిమల్ లుక్.. విలన్ పాత్రదని సినీవర్గాలు తెలిపాయి. హీరో, విలన్ పాత్రల్లో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు వెల్లడించాయి. దీంతో విలన్ లుక్ అదిరిపోయిందని, హీరో లుక్ కోసం వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


