News March 25, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: రేపు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బుధవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు జిల్లా కేంద్రంలోని షాదీ మహల్‌లో జరిగే ఇఫ్తార్ వేడుకలకు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు పార్లమెంటు సభ్యులు హాజరవుతారన్నారు.
Similar News
News December 23, 2025
VHT: విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు తప్పని నిరాశ

భారత స్టార్ క్రికెటర్లు విరాట్, రోహిత్ చాలాకాలం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. వీరిద్దరి ఆట చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఢిల్లీ-ఏపీ మ్యాచ్ బెంగళూరులో, ముంబై-సిక్కిం మ్యాచ్ జైపూర్‌లో బుధవారం జరగనున్నాయి. ఈ 2 వేదికలలో ఆన్‌లైన్ స్ట్రీమింగ్, బ్రాడ్‌కాస్ట్‌కు బీసీసీఐ ఏర్పాట్లు చేయలేదు. NZతో ODI సిరీస్‌కు ముందు సన్నాహకాలుగా ఈ మ్యాచ్‌లు ఉపయోగపడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
News December 23, 2025
పుంగనూరు: అనపకాయలకు భలే డిమాండ్

చిత్తూరు జిల్లాలో ఈ సీజన్‌లో అనపకాయలు విరివిగా లభిస్తాయి. పలువురు రైతులు వీటిని ప్రధాన పంటగా, అంతర్ పంటగా భూముల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం రైతులు కిలో రూ.50 చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి ఇవి ఎగుమతి అవుతున్నాయి. అనప గింజలు, పితికి పప్పు కూరను పలువురు ఇష్టంగా తింటారు. అలాగే వీటిని నూనెలో వేయించి స్నాక్స్‌గా కూడా వాడుతారు.
News December 23, 2025
NZB: మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి: కలెక్టర్

మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది.


