News January 25, 2025

శ్రీ సత్యసాయి జిల్లా రౌండప్

image

☞ నేడు ‘మెము’ రైలు రద్దు
☞ మోసం కేసులో కదిరిలో ఇద్దరి అరెస్ట్
☞ అంతర్జాతీయ జూడో పోటీలకు చిగిచెర్ల విద్యార్థి
☞ కదిరి జాబ్ మేళాలో 62మందికి ఉద్యోగాలు
☞ రిపబ్లిక్ ఉత్సవాలకు లేపాక్షి విద్యార్థి సాయి కిరణ్‌కు ఆహ్వానం
☞ జాగ్రత్త: పెనుకొండలో సచివాలయ ఉద్యోగినంటూ మోసాలు
☞ క్వింటా రూ.7,550లతో చిగిచెర్లలో కందుల కొనుగోలు

Similar News

News November 6, 2025

గద్వాల్: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

image

గద్వాల పట్టణంలోని బీడి కాలనీకి చెందిన సలీం స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. గాలం వేస్తుండగా జారి ప్రమాదవశాత్తు రేకులపల్లి వద్ద ఉన్న గుండాల జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ​స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. అతడి కోసం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహన్ని వెలికితీసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. తండ్రి మౌలాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News November 6, 2025

పీలేరు కేంద్రగా రెవెన్యూ డివిజన్.!

image

మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పుంగనూరుకు బదులు పీలేరు కేంద్రగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు క్యాబినేట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ముందుగా పుంగనూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వినిపించాయి. కాగా పీలేరులో ఏఏ మండాలలు ఉంటాయో స్పష్టత రావాల్సి ఉంది.

News November 6, 2025

రెండో రోజూ ఏసీబీ సోదాలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉందని తెలుస్తోంది. లెక్కల్లో చూపని నగదును పెద్దమొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.