News March 25, 2024
శ్రీ సత్యసాయి: టీడీపీ నాయకుడి దారుణ హత్య

నల్లమాడ మండల పరిధిలోని కుటాలపల్లిలో టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని తోట వద్ద నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News January 2, 2026
శిల్పారామంలో అలరించిన నూతన సంవత్సర వేడుకలు

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా గురువారం సాయంత్రం
నిర్వహించిన విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జానపద గేయాలు, నృత్య ప్రదర్శనలను నిర్వహించినట్లు పరిపాలనాధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. శిల్పారామానికి వచ్చిన వీక్షకుల్లోని చిన్నారులు నృత్య ప్రదర్శన ఇచ్చారన్నారు. ఈ వేడుకలో సుమారు 5,000 మంది పాల్గొన్నారన్నారు.
News January 1, 2026
గుంతకల్లులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుంతకల్లులోని పారిశ్రామిక వాడ సమీపంలో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బైక్పై వెళ్తున్న అతను ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 1, 2026
ATP: చేతివాటం ప్రదర్శించిన బేకరీల యజమానులు

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలోని కొందరు బేకరీ షాపుల యజమానులు చేతివాటం ప్రదర్శించారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ తనిఖీలు చేపట్టగా తూకాల్లో మోసం వెలుగు చూసింది. 1 కిలో కేక్కి 200 గ్రాములు తగ్గింది. కణేకల్, ఉరవకొండ, విడపనకల్లులో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. కణేకల్లులోని 2 షాపుల్లో రూ.20 వేలు, ఉరవకొండలో 4 షాపుల్లో రూ.41వేలు, విడపనకల్లులో 3 షాపుల్లో రూ. 27వేలు జరిమానా విధించారు.


