News February 7, 2025

శ్రీ సత్యసాయి: నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య

image

సోమందేపల్లి మండలం కేతగాని చెరువులో వివాహిత హిమజ(26) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఆదర్శ్‌తో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అదే ఊరిలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Similar News

News January 1, 2026

హెల్మెట్‌కు పాలస్తీనా జెండా.. JK11 ప్లేయర్ అరెస్ట్

image

పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ పెట్టుకుని డొమెస్టిక్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ఆడిన JK11 టీమ్ ప్లేయర్ ఫుర్కాన్ భట్‌ను జమ్మూ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ & కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా జమ్మూ ట్రయల్ బ్లేజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లీగ్ నిర్వాహకుడు జహీద్ భట్‌ను కూడా విచారించనున్నారు.

News January 1, 2026

జగిత్యాల కలెక్టర్, అదనపు కలెక్టర్లకు న్యాయవాదుల శుభాకాంక్షలు

image

నూతన సంవత్సరం సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌ను గురువారం జిల్లా ప్రభుత్వ న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా అడిషనల్ కలెక్టర్లు బి.ఎస్.లత, బి.రాజగౌడ్లను కూడా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పారు. జగిత్యాల ఏజీపీ బొగా ఓం ప్రకాష్, మెట్‌పల్లి ఏజీపీ అబ్దుల్ హఫీజ్, ధర్మపురి ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, కోరుట్ల ఏజీపీ గోనె రాజేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు.

News January 1, 2026

పాలమూరు-రంగారెడ్డిపై చర్చకు KCR వచ్చేనా?

image

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం అన్యాయం చేస్తోందని BRS చీఫ్ KCR ఇటీవల ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. KCRకు సమాధానమిచ్చేందుకు CM రేవంత్, మంత్రులు సన్నద్ధమయ్యారు. కాగా తొలిరోజు సభకు వచ్చిన KCR 3 ని.లలోనే వెళ్లిపోయారు. శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యే సభకు ఆయన వస్తారో లేదో సందిగ్ధంగా మారింది. సవాల్ విసిరి రాకపోతే ఒకింత నష్టమేనన్నభావన BRS వర్గాల్లో ఉంది.