News January 5, 2026

శ్రీ సత్యసాయి: పోలీసుల ఎదుటే మర్డర్.. అసలేం జరిగింది!

image

తనకల్లు PS గేటు వద్ద తెల్లవారుజామున జరిగిన <<18765758>>హత్య<<>> కలకలం రేపింది. పోలీసుల భద్రతా వైఫల్యమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఈశ్వర ప్రసాద్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను నెల్లూరు(D) గూడూరు తీసుకెళ్లాడు. మహిళ భర్త హరి 3రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. పోలీసులు గుర్తించి తీసుకురాగా వేటకొడవళ్లతో వేచిఉన్న హరి, బంధువులు కారు దిగగానే దాడిచేసి హతమార్చారు. పక్కనే పోలీసులున్నా రక్షించలేకపోయినట్లు సమాచారం.

Similar News

News February 10, 2026

మక్తల్: ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు: ఎస్పీ

image

మక్తల్ పట్టణంలో ఇవాళ తెల్లవారుజామున బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు BNS సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆత్మహత్య ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు చేసి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా సహకరించాలని ప్రజలను కోరారు.

News February 10, 2026

జమ్మికుంటలో ఓటుకు రూ.10 వేలు?

image

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఓటు విలువపై చర్చ వేడెక్కుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ఒక్క ఓటుకు రూ.10 వేలు, 25కిలోల రైస్ బ్యాగ్ అందిస్తున్నారని పట్టణమంతా హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు మహిళా ఓటర్లే లక్ష్యంగా నగదు రూ.5వేలు, వెండి కుంకమ భరణి, చీరలు బహుమతులుగా అందిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక రికార్డు బ్రేక్ చేస్తూ జరిగే మున్సిపల్ ఎన్నికలతో రాత్రికి రాత్రే అభ్యర్థుల భవిష్యత్ మారనుంది.

News February 10, 2026

ఎల్లుండి నుంచి MLAలకు డిజిటల్ అటెండెన్స్!

image

AP: అసెంబ్లీకి కొందరు సభ్యులు గైర్హాజరు అవుతుండటంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు సభ్యుల ఫింగర్ ప్రింట్స్ నమోదు చేసి.. ఎల్లుండి నుంచి డిజిటల్ విధానంలో హాజరు తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే MLA తనకు కేటాయించిన స్థానంలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. అటు రేపు జగన్‌తో పాటు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్తారని ఆ పార్టీ నేత బొత్స తెలిపారు.