News March 3, 2025
శ్రీ సత్యసాయి: మంత్రి సవిత తీపి కబురు

ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం తల్లికి వందనం అందజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మంది మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణతో పాటు మిషన్లను అందజేస్తామన్నారు.
Similar News
News July 7, 2025
వై.రామవరం: ప్రభుత్వం ఆదుకోవాలి

కడుపులోని పెరుగుతున్న పెద్దకాయతో బాధపడుతూ ఓ వ్యక్తి మంచానికే పరిమితమయ్యాడు. వై.రామవరం (M) కే.ఎర్రగొండకు వెంకటేశ్ దీర్ఘకాలంగా ఈ వ్యాధితో బాధ పడుతున్నాడు. తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు ఇటీవల మరణించారని, ఒంటరిగా ఉన్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.
News July 7, 2025
సినీ హీరో మహేశ్‌బాబుకు నోటీసులు

TG: సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న హీరో మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులిచ్చింది. తమ వెంచర్‌కు అన్ని అనుమతులున్నాయని మహేశ్ ఫొటోతో ఉన్న బ్రౌచర్ చూసి బాలాపూర్‌లో ₹34.80లక్షలు పెట్టి స్థలం కొన్నామని ఇద్దరు ఫిర్యాదు చేశారు. లేఔట్ లేకపోవడంతో డబ్బు ఇవ్వమంటే సంస్థ ₹15లక్షలే ఇచ్చిందన్నారు. దీంతో ఇవాళ విచారణకు హాజరుకావాలని మహేశ్‌తో పాటు సంస్థను కమిషన్ ఆదేశించింది.
News July 7, 2025
పటాన్‌చెరు: మృతదేహాల అప్పగింత సజావుగా జరగాలి: కలెక్టర్

పటానుచెరు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల గుర్తింపు ప్రక్రియ డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కొనసాగుతోందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అంబులెన్స్, పోలీస్ ఎస్కార్ట్‌తో పాటు మృతదేహాల అప్పగింత పనులు సజావుగా జరగాలని అధికారులను ఆదేశించించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు.