News June 14, 2024

శ్రీ సత్యసాయి: రోల్‌వెల్ పరిశ్రమలో వ్యక్తి మృతి

image

హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలోని రోల్‌వెల్ పరిశ్రమలో శుక్రవారం ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. కొటిపి ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ(44) రోల్‌వెల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రోజులాగే గురువారం విధులకు వెళ్లి మృతిచెందాడు. గుండెపోటుతో మృతి చెందాడా? లేక ప్రమాదం ఏమైనా సంభవించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 1, 2026

అనంతపురం: హెల్మెట్ ధరిస్తే వెండి నాణెం బహుమతి

image

అనంతపురం నగరంలోని ఎంజీ పెట్రోల్ బంక్ వద్ద హెల్మెట్ ధరించిన వాహనదారులను పోలీసులు వినూత్నంగా సత్కరించారు. రోడ్డు భద్రత కోసం ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన నేటి నుంచి అమలులోకి రాగా ఈ కార్యక్రమం చేపట్టారు. 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, 4 టౌన్ సీఐ జగదీశ్ వాహనదారులకు వెండి నాణేలు, రోజా పూలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు.

News February 1, 2026

అనంతపురం జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

image

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు తగ్గాయి. గుత్తిలో కేజీ రూ.240, అనంతపురంలో రూ.250, గుంతకల్లులో రూ.220గా విక్రయిస్తున్నట్లు వ్యాపారి రియాజ్ తెలిపారు. గత వారంతో పోలిస్తే ధరలు తగ్గడం పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.750 వద్ద స్థిరంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ధరల తగ్గుదల నేపథ్యంలో చికెన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది.

News February 1, 2026

అంబటిపై ఫిర్యాదు చేసిన TDP ఎమ్మెల్యే

image

వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలపై పూల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌కి శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణీ శ్రీ, జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్ చౌదరి ఫిర్యాదు చేశారు. పూల నాగరాజు మాట్లాడుతూ.. రాజకీయాల్లో మంచిగా వ్యవహరించాలని అంబటికి హితవుపలికారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదన్నారు.