News April 10, 2025
శ్రీ సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ

ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. మొత్తం 120 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద సూపరింటెండెంట్ హనుమంతయ్య, అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు.
Similar News
News April 18, 2025
సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదు అయ్యాయి. కొనరావుపేట 40.9 °c,చందుర్తి 40.8 °c,సిరిసిల్ల 40.8 °c,ఇల్లంతకుంట 40.7 °c,వీర్నపల్లి 40.5 °c,గంభీరావుపేట 40.3 °c,తంగళ్ళపల్లి 40.2°c, వేములవాడ రూరల్ 39.9°c, ఎల్లారెడ్డిపేట 39.8°c, బోయిన్పల్లి 39.8°c, ముస్తాబాద్ 38.9°c,లుగా నమోదు అయ్యాయి. 7 మండలాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ జోన్ ప్రకటించింది.
News April 18, 2025
పోచంపల్లితో వినోబా భావేకు విడదీయని అనుబంధం

ఆచార్య వినోబా భావేకు <<16135013>>పోచంపల్లితో <<>>విడదీయని అనుబంధం ఉంది. మొదటిసారి 1951లో పోచంపల్లికి వచ్చారు. అలాగే 1956 జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా రెండోసారి వచ్చారు. భూదానోద్యమానికి కార్యోన్ముఖునిగా నిలిచిన పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబా భావే పేర్కొనడం విశేషం. వినోబా భావే మరణాంతరం భారత ప్రభుత్వం ఆయన ఆవిశ్రాంత కృషికి గాను 1982లో ‘భారతరత్న’ బిరుదును ప్రకటించింది.
News April 18, 2025
వాట్సాప్‌లో కొత్త ఫీచర్

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్‌లో ‘Quality for downloaded photos and videos’ ఫీచర్ రానుంది. దీని ద్వారా మీడియా ఫైల్స్‌ను నచ్చిన క్వాలిటీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ లేదా హై క్వాలిటీ ఆప్షన్‌లలో నచ్చిన దానిని ఎంచుకోవాలి. మీరు స్టాండర్డ్ క్వాలిటీ పెట్టుకుంటే అవతలి వ్యక్తి HDలో పంపినా మీకు స్టాండర్డ్ క్వాలిటీలోనే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. తద్వారా డేటా సేవ్ అవుతుంది. డౌన్‌లోడ్ స్పీడూ పెరుగుతుంది.