News November 1, 2025

షట్‌డౌన్ ఎఫెక్ట్.. అమెరికాలో $7 బిలియన్లు ఆవిరి

image

అమెరికా గవర్నమెంట్ <<17882827>>షట్‌డౌన్ <<>>సంక్షోభం మరింత ముదురుతోంది. అక్టోబర్ 1 నుంచి ఇప్పటిదాకా $7 బిలియన్ల నష్టం వాటిల్లినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఈ ప్రతిష్టంభన ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై అంత ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. షట్‌డౌన్ ఆరు వారాలు కొనసాగితే $11 బిలియన్లకు, 8 వారాలు కొనసాగితే $14 బిలియన్లకు నష్టాలు పెరుగుతాయని హెచ్చరించింది.

Similar News

News November 1, 2025

ప్రకృతి సేద్యంలో వరి సాగు – ఆకునల్లి, పచ్చదోమ నివారణ

image

☛ ఆకునల్లి నివారణకు గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
☛ పచ్చదోమ నివారణకు పసుపు, తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను పెట్టాలి. 100 లీటర్ల నీటికి 5లీటర్ల వావిలాకు కషాయాన్ని కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.

News November 1, 2025

ఎల్లుండి నుంచి మెట్రో రైలు సమయాల్లో మార్పు

image

TG: మెట్రో రైలు సమయాల్లో మార్పు చోటు చేసుకోనుంది. తొలి ట్రైన్ ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి మొదలవుతాయని L&T హైదరాబాద్ మెట్రో పేర్కొంది. ఎల్లుండి నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు తొలి ట్రైన్ ఉదయం 6గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11:45గంటలకు మొదలైన సంగతి తెలిసిందే.

News November 1, 2025

ఢిల్లీలో వాయు కాలుష్యంతో 17,188 మరణాలు

image

ఢిల్లీలో సంభవించిన మరణాల్లో ఏడింటిలో ఒక మరణానికి వాయుకాలుష్యమే కారణంగా ఉంది. 2023లో వాయుకాలుష్యం వల్ల 17,188(15%) మంది మరణించినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యూయేషన్(IHME) నివేదిక తెలిపింది. అదే ఏడాది హైబీపీతో 12.5%, మధుమేహంతో 9శాతం, అధిక కొలెస్ట్రాల్‌తో 6%, ఊబకాయంతో 5.6శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. 2018-24 మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఉంది.