News February 10, 2026

షమీకే ఎందుకిలా?

image

గాయంతో జట్టుకు దూరమై రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న బౌలర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా <<19095739>>BCCI<<>> ప్రకటించిన కాంట్రాక్ట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. గత కొంతకాలంగా దేశవాళీలో ఆడుతున్నప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు లిస్టులోనూ పేరు లేకపోవడంతో BCCI అతడిని పక్కనపెట్టిందా అనే చర్చ జరుగుతోంది. షమీ గతేడాది మార్చిలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.

Similar News

News February 10, 2026

ఇస్రో దూకుడు.. స్పేస్ స్టేషన్, గగన్‌యాన్, 80 శాటిలైట్లపై వర్క్..!

image

సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా వేగంగా ముందుకు సాగుతున్నట్లు ISRO ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. మానవ సహిత గగన్‌యాన్ స్పేస్ మిషన్, ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్స్ వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. రీసెర్చ్, విపత్తు నిర్వహణ, భద్రత, నావిగేషన్‌తోపాటు గగన్‌యాన్ మిషన్ కోసం సంకేతాలను భూమికి పంపడంలో కీలక పాత్ర పోషించే మొత్తం 80 ఉపగ్రహాలపై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు.

News February 10, 2026

జననాయగన్ సెన్సార్ వివాదం.. CBFCపై కేసు వెనక్కి!

image

జననాయగన్ సినిమా సెన్సార్ విషయంలో CBFCపై వేసిన కేసును వెనక్కి తీసుకునేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ సమర్పించారు. చట్టపరమైన చర్యలకు బదులు సినిమాలో మార్పులు చేసి మరోసారి రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జనవరి 9నే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ ఇష్యూస్‌తో వాయిదాపడ్డ విషయం తెలిసిందే.

News February 10, 2026

ఓటుకు రూ.30వేలు.. గెలిపిస్తే అర తులం బంగారం!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు భారీగా వెచ్చిస్తున్నట్లు సమాచారం. ORR సమీపంలోని మున్సిపాలిటీలలో ఓటుకు ఏకంగా రూ.10-30వేల చొప్పున ఇస్తున్నారని తెలుస్తోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఓ అభ్యర్థి గెలిస్తే అర తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చాడు. చాలా చోట్ల ఓటుకు రూ.3-5వేల వరకు పంచడమే కాకుండా చికెన్/మటన్, మందు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.