News October 22, 2025

షరతులతో సందర్శనకు అనుమతి: అనకాపల్లి ఎస్పీ

image

రాజయ్యపేట గ్రామాన్ని సందర్శించే 48 మందికి వైసీపీ నాయకులకు షరతులతో అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ర్యాలీ, రోడ్ షో, భారీ సమావేశం నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సమావేశం నిర్వహించే సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేశారు.

Similar News

News October 22, 2025

జనగామ జిల్లాలో బుధవారం టాప్ న్యూస్!

image

> ఔట్సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
> ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కడియం
> పోచన్నపేట శివారులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
> జీడికల్ బ్రహ్మోత్సవాలపై కడియం సమీక్ష
> ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం కావాలి: కలెక్టర్
> జనగామ నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
> రైజింగ్ 2047 సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్
> ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలి: యాస్మిన

News October 22, 2025

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి: హోంమంత్రి

image

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికలతో ఆయా జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ వినోద్ కుమార్ వీక్షణ సమావేశానికి హాజరయ్యారు.

News October 22, 2025

VKB: భూభారతి ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

రైతుల భూ సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో భూభారతి చట్టం ద్వారా స్వీకరించిన భూ సమస్యల పరిష్కారంపై ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల కోసం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని, దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా వేగంగా పరిష్కరించాలని సూచించారు.