News February 8, 2025
షర్మిలకు కేతిరెడ్డి కౌంటర్

YS జగన్‌పై షర్మిల చేసిన కామెంట్స్‌కు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నేత ఎవరో ప్రజలకు తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే ఆడిటర్‌గా ఉన్న వ్యక్తి పదవులు అనుభవించారు. పార్టీ నుంచి బయటకి వెళ్లాక మీకేదో చెప్పారని దాన్ని మాట్లాడటం, YS కుటుంబ పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ప్రజలందరికీ తెలుసు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 14, 2025
MHBD: బైకులో పాము కలకలం (PHOTO)

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివాజీ బైక్‌లో పాము చేరింది. శివాజీ విధులు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌లో పాము దూరింది. వెంటనే పైకి లేవగా, అప్రమత్తమైన అధికారి బైక్‌ను పక్కకు నిలిపాడు. సుమారు 2 గంటల తర్వాత పాము కిందకు దిగివెళ్లిపోవడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.
News March 14, 2025
FLASH: కామారెడ్డి: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

కామరెడ్డి జిల్లాలోని హైవేపై టేక్రియాల్ గేట్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందాడని చెప్పారు. ఆటో వెనుక నుంచి వస్తున్న లారీ నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆటోడ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 14, 2025
హోలీ.. సీఎం రేవంత్ పాత ఫొటోలు

TG: హోలీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి పాత ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాటి ఆప్తమిత్రులతో కలిసి రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకున్నారు. మరి పై ఫొటోల్లో సీఎం ఎక్కడ ఉన్నారో గుర్తు పట్టారా? కామెంట్ చేయండి.