News February 8, 2025

షర్మిలకు కేతిరెడ్డి కౌంటర్

image

YS జగన్‌పై షర్మిల చేసిన కామెంట్స్‌కు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నేత ఎవరో ప్రజలకు తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే ఆడిటర్‌గా ఉన్న వ్యక్తి పదవులు అనుభవించారు. పార్టీ నుంచి బయటకి వెళ్లాక మీకేదో చెప్పారని దాన్ని మాట్లాడటం, YS కుటుంబ పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ప్రజలందరికీ తెలుసు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 8, 2025

ఆప్‌కు కాంగ్రెస్ ‘ఓట్ షేరింగ్’ దెబ్బ

image

ఢిల్లీ ఎన్నికలు ఫలితాలు ఆప్‌కు అధికారాన్ని దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ పార్టీ దారుణంగా చీల్చడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15% ఓట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.26 % ఓట్లు రాగా, ప్రస్తుతం 17% ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆప్‌కు దక్కాల్సిన మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది.

News February 8, 2025

నెల్లూరు: ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని సిద్ధంగా ఉన్నాయని RIO శ్రీనివాసులు తెలిపారు. శనివారం D.K బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎగ్జామినర్ల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణ కోసం అన్ని సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

News February 8, 2025

ఒంగోలు: తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలి: కలెక్టర్

image

వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడ తాగునీటికి ఇబ్బంది కలగకుండా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్, జేసీతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, వార్డుల వారీగా అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించడంతో పాటు, ఏప్రిల్ నెల వరకు ఎంత మేర నీరు అవసరమో వాటర్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

error: Content is protected !!