News March 3, 2025
షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News January 2, 2026
KNR: మానేరు రివర్ ఫ్రంట్ అక్రమాలపై అసెంబ్లీలో చర్చ?

మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో చర్చించేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి కోసం కేటాయించిన రూ.545 కోట్లలో, పనులు పూర్తి కాకుండానే రూ.192 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించడం వివాదాస్పదమైంది. దీనిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు నిరసనలు చేపట్టాయి. కాగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
News January 2, 2026
నవరత్నాలు ఇవే! ఎవరు ఏది ధరించాలంటే..

వజ్రం(Diamond): భరణి, పుబ్బ, పూర్వాషాడ
వైడూర్యం(Cats Eye): అశ్విని, మఖ, మూల
కెంపు(Ruby): కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ
ముత్యం(Pearl): రోహిణి, హస్త, శ్రవణం
పగడం (Coral): మృగశిర, చిత్త, ధనిష్ట
గోమేధికం (Zircon): ఆరుద్ర, స్వాతి, శతభిషం
పుష్యరాగం (Yellow Topaz): పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర
నీలం (Blue Sapphire): పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర
పచ్చ (Emerald): ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు ధరించాలి.
News January 2, 2026
హాస్యనటుడు AVS మన తెనాలి వారే.!

గుంటూరు (D) తెనాలిలో జనవరి 2, 1957లో జన్మించిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (ఏవీఎస్) తెనాలి వీఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. పత్రికా విలేకరిగా, డ్రామా ఆర్టిస్ట్‌గా పలు నాటికలు ప్రదర్శించారు. నటనపై మక్కువతో సినీ రంగ ప్రవేశం చేశారు. మిస్టర్ పెళ్లాం సినిమాలో ‘అదో తుత్తి’ అనే మేనరిజంతో హాస్యాన్ని పండించారు. ఘటోత్కచుడు, రంగుపడుద్ది, శుభలగ్నం, గాలి కనపడుతోందా కామెడీతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.


