News December 21, 2025

షాకింగ్.. బిగ్‌బాస్ విన్నర్ ప్రకటన!

image

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 విజేత ఎవరనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో విన్నర్ ఎవరో తెలియనుండగా ఆన్‌లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా ముందే విజేతను చెప్పేసింది. ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ అని పేర్కొంది. కాగా వికీపీడియాలో ఎవరైనా మార్పులు(ఎడిట్) చేసే అవకాశముంది. దీంతో కొందరు కావాలనే వ్యూయర్స్‌ను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి బిగ్‌బాస్ టీమ్‌తో ఎలాంటి సంబంధాలు ఉండవు.

Similar News

News December 22, 2025

ఆసుపత్రి వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం

image

TG: ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు ఆసుపత్రి వార్డుల్లో రోగుల సహాయకులు భోజనం చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిషేధం విధించింది. క్యాంటీన్లలోనే ఆహారం తినేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరింది. వార్డులో ఆహారం తిని పారవేయడంతో ఎలుకల బెడద పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

News December 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 104

image

ఈరోజు ప్రశ్న: పురాణాల ప్రకారం ఓ నెల పురుషుడిగా, మరో నెల స్త్రీగా మారుతూ.. రెండు వంశాలకు ప్రతినిధిగా నిలిచిన వ్యక్తి ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 22, 2025

ICMRలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (<>ICMR<<>>)లో 7 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, MD, MS, PhD, B.V.Sc&AH, MVSc& AH, PG(బయో మెడికల్ సైన్సెస్), ఫార్మా డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.icmr.org.in