News January 13, 2026
షాక్స్‌గామ్ వ్యాలీ.. భారత్‌కు ఎందుకంత కీలకం?

<<18842137>>షాక్స్‌గామ్ వ్యాలీ<<>> భారత్‌కు భౌగోళికంగా, రక్షణ పరంగా చాలా కీలకం. ఇది ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. భారత్ మాత్రం దీన్ని తన భూభాగంగానే పరిగణిస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ శత్రువులకు పట్టు చిక్కితే లద్దాక్‌లోని సైనిక కదలికలను ఈజీగా గమనించొచ్చు. ఈ ప్రాంతం ద్వారా చైనా, పాక్ మధ్య రాకపోకలు పెరిగి ఒకేసారి భారత్‌పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది.
Similar News
News January 20, 2026
350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 20, 2026
JAN 26 తర్వాత సాదా బైనామాలపై కొత్త రూల్స్!

TG: LRSలో పెండింగ్‌లో ఉన్న దాదాపు 9 L సాదా బైనామా అప్లికేషన్లను పరిష్కరించడానికి GOVT కొత్త రూల్స్ సిద్ధం చేస్తోంది. భూ భారతిలో సాంకేతిక సమస్యలు, దరఖాస్తుదారులు, భూ యజమానుల మధ్య వివాదాలతో వీటిని రూపొందిస్తోంది. అఫిడవిట్ల విధానాన్నీ మార్చనుంది. ఇవి JAN26 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా దరఖాస్తుదారులకు హక్కులు కల్పిస్తే అధికారులపై కోర్టులకు వెళ్తామని యజమానులు హెచ్చరించడంతో తర్జనభర్జన పడుతున్నారు.
News January 20, 2026
బంగారం ఆల్ టైమ్ హై.. 10 గ్రా. రూ.1.52 లక్షలు

పసిడి పరుగులు ఆగడం లేదు. ఇవాళ మరోసారి పెరిగి ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర ఏకంగా రూ.1,52,000 (3 శాతం జీఎస్టీతో కలిపి) దాటింది. సిల్వర్ కూడా రిటైల్ ధర కిలో రూ.3,39,900 (3% GSTతో కలిపి) పైనే పలుకుతోంది.


