News July 27, 2024
షాద్‌నగర్: విద్యుత్ శాఖ ఉన్నతాధికారిపై వేటు

షాద్‌నగర్ ట్రాన్స్ కో డిపార్ట్‌మెంట్‌లో గ్రేడ్ 2 ఉద్యోగి ఆర్టిజన్ ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల యూనిట్‌లో పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వినియోగదారుల వద్ద డబ్బులు తీసుకుని వాటిని శాఖకు చెల్లించకపోవడం, నిధులు దుర్వినియోగం చేయడంపై చర్యలు తీసుకున్నారు.
Similar News
News February 12, 2026
MBNR: గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజ

APలోని తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సౌత్ జోన్ షూటింగ్ బాల్‌లో మహమ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన శ్రీజ అద్భుత ప్రదర్శన కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈనెల 7 నుంచి జరిగిన సౌత్ జోన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గోల్డ్ మెడల్ సాధించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.
News February 11, 2026
మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5% ఓటింగ్ నమోదు

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పురపాలికలు, 1 నగరపాలికలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69.05 ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవరకద్రలో 85.51 శాతం ఓటింగ్, భూత్పూర్‌లో 84.58 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలికలో 67.73% ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.
News February 11, 2026
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఏపీ జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 44 డివిజన్ పంచాయితీ రాజ్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


