News October 28, 2024
షాద్‌నగర్: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

షాద్‌నగర్ నియోజకవర్గం చౌదరిగూడ PSలోని కాసులాబాద్ గ్రామానికి చెందిన రాజు మరణానికి కారణమైన అంజయ్యకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసుల వివరాలు.. 2020లో డబ్బులు విషయంలో గొడవ జరగగా రాజును గొడ్డలితో అంజయ్య హత్య చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం రంగారెడ్డి జిల్లా కోర్టు ఈరోజు ఈమేరకు తీర్పునిచ్చింది.
Similar News
News February 14, 2026
MBNR: ఈనెల 18న క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 18న అమ్నీల్ ఫార్మా, ఆర్-సొల్యూషన్స్ సంస్థలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ జరగనుంది. 2025-26 బ్యాచ్ ఫార్మసీ, ఎంబీఏ, ఎం.కామ్ విద్యార్థులు అసలు సర్టిఫికెట్లు, రెజ్యూమ్‌తో ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియానికి రావాలని ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా. ఎస్.ఎన్. అర్జున్ కుమార్ తెలిపారు. QC, QA, ప్రొడక్షన్ విభాగాల్లో నియామకాలు ఉంటాయి.
News February 14, 2026
పాలమూరు: జాతీయ చీఫ్ వచ్చినా.. ప్రభావం చూపని బీజేపీ!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. MBNRలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, కిషన్ రెడ్డి కూడా ప్రచారం చేసినా బీజేపీ జెండా ఎగరలేదు. ఎంపీ డీకే అరుణ సొంత నియోజకవర్గంలో 37 వార్డుల్లో కేవలం 7 మాత్రమే గెలిచాయి. దీంతో కాషాయ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
News February 14, 2026
MBNR: లెక్కింపు ప్రక్రియ విజయవంతం: ఎస్పీ

పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిందని ఎస్పీ జానకి తెలిపారు. లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందన్నారు. వారం రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


